మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం

Adialabad,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-దహెగాం
మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన రామగుండం సంజీవ్‌ ఇల్లు, ఇంటి గోడలు పాక్షికంగా కూలిపోయాయి. అలాగే చాలా గ్రామాల్లో పంట చేన్లు నీట మునగగా పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి.
భారీ వర్షానికి తెగిన చెరువు మత్తడి
పెంచికల్‌పేట్‌ : మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపెల్లి గ్రామ శివారులో గల పెద్ద చెరువు మత్తడి కొట్టుకుపోయి చెరువులోని నీరంతా బయటకు ప్రవహించింది. మండలంలో మత్తడి కొట్టుకుపోవడంతో చెరువు కింద సాగు చేసే వంద ఎకరాల ఆయకట్టు పొలాలకు నీరందకుండా పోతుంది. మండలకేంద్రంలో బెజ్జూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఒర్రెలు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు, ఒర్రెలు ప్రవహిస్తున్నాయి.