
– పలు చెరువులు కు గండి
– నీట మునిగిన పంట పొలాలు
నవతెలంగాణ- రామారెడ్డి
నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో బుధవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పోసానిపేటలో గండ్ర నారాయణ, చాకలి భాస్కర్, వడ్ల బాలయ్య, గొల్లపల్లిలో కందూరి రాజయ్య, కోమటి ప్రహ్లాద్, కన్నాపూర్, స్కూల్ తాండ, అన్నారం తదితర గ్రామాల్లో నివాసపు ఇండ్లు కూలడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు పునరావాస కేంద్రాలుగా పాఠశాలలో ఏర్పాట్లను చేశారు. బట్టు తండాలో కుంట తెగడంతో పంట పొలాల్లో, తండాల్లోకి నీరు వచ్చి చేరింది. కన్నాపూర్, రామారెడ్డి గంగమ్మ వాగు, పోసానిపేట గంజి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించింది. ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఎమ్మార్వో ఆనంద్, ఎంపీడీవో విజయ్ కుమార్ తో పాటు ఎంపీఓ సవిత, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై అనిల్ తో పాటు ఆయా ప్రజాప్రతినిధు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల్లో వర్ష ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు.