వీణవంకలో భారీ వర్షం..

నవతెలంగాణ-వీణవంక
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. కర్షకులు పొలంబాట పట్టి వరినాట్లు వేస్తున్నారు. జాలర్లు మత్తడుల వెంట చేపల వేటకు వెళ్లారు. కల్వల ప్రాజెక్టుతో పాటు రెడ్డిపల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి పడడంతో వీణవంక చెక్ డ్యాం జోరుగా మత్తడి పడతుండడంతో సందర్శులకు తిలకిస్తున్నారు. సందర్శకుల సందడితో వీణవంక బ్రిడ్జి వద్ద చెక్ డ్యాం చూపరులను ఆకట్టుకుంటోంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.