ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం..

నవతెలంగాణ – ఆమనగల్ 
నైరుతి రుతుపవనాల రాకతో ఆమనగల్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తొలకరి జల్లులతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన ఎండల వేడిమితో అల్లాడిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.