ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు

– హెచ్చరించిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు ఎక్కువ ప్రదేశాల్లో పదే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీన ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు.