జిల్లాలో విస్తారంగా వర్షాలు

జిల్లాలో విస్తారంగా వర్షాలు– అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు జిల్లాలో మంగళవారం విస్తారంగా వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. అడ ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు నమోదు కావడంతో సోమవారం రాత్రి జిల్లాలోని అడ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. వీటిలో 4, 5 గేట్లు 0.15 మీటర్‌ మేర ఎత్తి 652 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా ఆదివారం ఉదయం నాటికి 237.900 మీటర్లకు చేరుకొంది. ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 5.963 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ ఫ్లో 642 క్యూసెక్కులుగా ఉంది. దీనితో రెండు గేట్లు ఎత్తి 652 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు కింద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.