– మండల వ్యాప్తంగా 144 సెక్షన్
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు చెందిన 26 పోలింగ్ బూత్లలో, 23 లొకేషన్లు, 6 రూట్లలో మండలంలోని అన్ని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా 120 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం ‘నవతెలంగాణ’ తో మాట్లాడుతూ సోమవారం పోలింగ్ జరగనున్న 26 సమస్యత్మకమైన పోలింగ్ బూత్ లను లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రీమిజం (ఎల్ డబ్ల్యూ ఈ) వామపక్ష తీవ్రవాదం ఉన్న సమస్యాత్మ కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. దీంతో అక్కడ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి 144 సెక్షన్, ఆపరేషన్ పార్టీలను మొహరించి రూట్ మైబైల్ టీమ్ల పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని పోలింగ్ బూతులలో సాధారణ భద్రత చర్యలు 144 సెక్షన్, నిఘా టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది తిరగవద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసినందున అన్ని గ్రామాలలో అదనపు పోలీస్ బలగాలను నియమించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండలంలో 48 గంటల పాటు బెల్ట్ షాపులు మూసివేయాలని పోలీస్ ఆదేశాలు ధిక్కరించి ఎక్కడ ఫిర్యాదుల అందిన ఎన్నికల నిబంధన మేరకు పీడీ కేసులు నమోదు చేయనట్లు హెచ్చరించారు.