– ఒక గేటు ద్వారా నీటీ విడుదల..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజేక్ట్ లోకి ఇటివలే కుర్షిన వరదలకు ఎగువ నుండి భారీగా నీరు వచ్చి చేరిందని ప్రాజేక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు. ఈ సంధర్భంగా ఏఈ రవిశంకర్ మాట్లాడుతు ప్రాజేక్ట్ పూర్తీస్థాయి నీటీ మట్టం 458 మీటర్లు ప్రస్తుతం 457.70 మీటర్లు ఉందని జుక్కల్ తో పాటు ఎగువన ఉన్న మహరాష్ట్ర, కర్ణాటక లో వర్షాలు బారీగా పడటంతో ప్రాజేక్ట్ నిండి పోయింది. ఒక గేటు తెరిచి దిగువకు వరదకాలువ ద్వారా 2వేల 25 వందల 25 క్యూసెక్కులు విడుదల చేయడం జర్గిందని తెలిపారు. మెయిన్ కెనాల్ ద్వారా నీటీ విడుదల లేదని వరదకాలువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కోన్నారు.