పంతంగి టోల్గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌

పంతంగి టోల్గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌–  బారుల తీరిన వాహనాలు
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి సొంతూర్లకు ప్రజలు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ఉంటోంది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం విజయవాడ -హైదరాబాద్‌ జాతీయ రహదారి పంతంగి టోల్గేట్‌ వద్ద శుక్రవారం ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండటంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జనం భారీగా తరలి వెళుతున్నారు.