‘రవాణా’లో భారీగా బదిలీలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రవాణాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుదీర్ఘకాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 150 మంది మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు (ఎమ్‌వీఐ), 23 మంది ప్రాంతీయ రవాణా అధికారులు (ఆర్టీఓ), ఏడుగురు డీటీసీలను బదిలీ చేశారు. అందరికీ వేర్వేరుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఉద్యోగులు తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు.