మండలంలో భారీ దిగుబడి పెరిగిన కంది పంట… 

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని గ్రామాలలో కంది పంట దిగుబడి భారీగా పెరిగింది. ఈ సందర్భంగా గ్రామాలలోని రైతులు కంది పంటను అంతర పంటగా సుమారుగా 1100 వందల ఎకరాలు విరిగివిగా పండించడం ఇక్కడ గత కొన్ని ఏళ్లు గా పరిపాటి గా మారింది. గతంలో కంది పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తమ కుటుంబ అవసరం  కొరకు కంది పంటను పండించేవారు. ప్రస్తుతం ధరలు భారీగా పెరడంతో మార్కెట్లో కంది పప్పుకు డిమాండ్ అధికంగా ఉండడం వలన రైతులు కంది పంటపై ఎక్కువగా మెగ్గు చూపుతున్నారు. అదేవిధంగా కంది పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం వలన  కేంద్రం మద్దతు ధర 7550 రూ” ముందస్తుగానే ప్రకటించి ఉండడం, బయటి దళారులు 7  పైచిలుకు వరకు వెచ్చించి నగదు డబ్బులు రైతులకు ముట్టజెప్పి తీసుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. 2023 – 24 సంవత్సరంలో మద్దతు ధర 7 వేల రూ” ఉండడం 2024 – 25 సంవత్సరంలో మద్దతు ధర 7550 రూ” మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. అంటే గత ఏడాది కన్నా ఈ ఏడు 550 రూపాయలు ధర కేంద్రం మద్దతు ధర పెంచి ప్రకటించింది.
ఈ ఏడు కంది పంట పండించేందుకు రైతులకు నాలుగు సార్లు రసాయనాలు పిచికారి చేయడం, విత్తనాలు పొలం దున్నడం వంటి కార్యక్రమాలకు ఎక్కువగానే ఖర్చులు అయినాయి. దిగుబడి ఈసారి ఎకరాకు మూడు క్వింటాల్ నుంచి 5 క్వింటాల్  వరకు దిగుబడి పెరిగింది ధర బాగా మార్కెట్లో ఉండడం వలన రైతులు లాభాల బాట పట్టినట్టు రైతులు అంటున్నారు. నీటి తడి ఏర్పాటు చేసుకున్న రైతులకు ఎకరాకు ఐదు, ఆరు క్వింటాళ్లు పండించగా, సాధారణ వర్షపాతానికి పండించిన పంట ఎకరాకు మూడు క్వింటాళ్లు దిగుబడి వచ్చింది, ఖర్చు కూడా తక్కువగానే ఉంది. అందుకే మార్కెట్లో రేటు కంది రైతుకు సరిపోయేంత ఉండడంతో రైతులు బాగానే  కంది పంట పండించారు.
సాయిలు రైతు , హంగార్గ గ్రామ రైతు :– నాకు రెండున్నర ఎకరాల సొంత భూమి ఉంది. అందులో సోయపంట పండిస్తూ అంతర పంటగా కంది పంటను వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కంది పంటకు నీటి సౌకర్యం ఉండడం వలన రెండు పర్యాయాలు నీరు పెట్టినాను, కంది దిగుబడి ఎకరాకు 6 క్వింటాళ్లు పండిందని రైతు సాయిలు తెలిపాడు.
నాగయ్య రైతు , డోన్గావ్ గ్రామం:– నాకు ఎకరం సొంత భూమి ఉంది అదనంగా మూడూ ఎకరాలు కౌలు చేసినాను. నీటి వసతి  లేకపోవడం వలన వర్షాధారంపైనే ఆధారపడి కంది పంటను అంతర పంటగా పత్తిలో పండించాను ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో మంచి ధర ఉండడంతో కొంతమేరకు లాభాలు మిగులుబాటు అవుతున్నాయని రైతు నాగయ్య అన్నాడు.