హలో బేబీ మొదలైంది

hello baby startedఎస్‌కెఎమ్‌ఎల్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ ప్రొడక్షన్‌ నెం.7గా నిర్మిస్తున్న చిత్రం ‘హలో బేబీ’. ఈ చిత్ర ప్రారంభోత్సవం దర్శకుడు యాదకుమార్‌ క్లాప్‌తో శనివారం ఘనంగా ప్రారంభ మైంది. రాంగోపాల్‌ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అరోరాశ్రీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు ఆరు చిత్రాలు నిర్మించాను. డిస్ట్రిబ్యూటర్‌గా అనేక చిత్రాలను రిలీజ్‌ చేశాను. నా బ్యానర్‌లో ఏడవ సినిమా ఇది. ఈ చిత్ర కథ ఇప్పటి వరకు ఇండియన్‌ హిస్టరీలో రాలేదు. ఇలాంటి ఒక కథ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్‌గా రమణ, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నితిన్‌, ఎడిటర్‌గా సాయిరాం తాటిపల్లి తదితర టాలెంటెడ్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు’ అని అన్నారు. ‘ఇదొక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం. నాయిక అరోరాశ్రీకి మంచి పేరు వస్తుంది’ అని దర్శకుడు తెలిపారు. ‘ఇంత మంచి సినిమాలో భాగమయ్యే ఛాన్స్‌ రావడం ఆనందం’ అని హీరోయిన్‌ అరోరాశ్రీ చెప్పారు.