హలో బీసీ, ఛలో వరంగల్ కు తరలిరావాలి

– సగర సంఘం రాష్ట్ర కోశాధికారి కుమారస్వామి 
నవతెలంగాణ పెద్దవంగర: హలో బీసీ, ఛలో వరంగల్ సభకు బీసీలు తరలిరావాలని సగర సంఘం రాష్ట్ర కోశాధికారి కుమారస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ఉప్పెరగూడెం గ్రామంలో బీసీ రాజకీయ యుద్ధ భేరి పోస్టర్ ను ఆయన సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య జమున, జిల్లా ఉపాధ్యక్షుడు బైన బిక్షపతి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నా వరంగల్ లో జరిగే బీసీ సభకు భారీ ఎత్తున తరలి వచ్చి, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సగర సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు బైన మేనకా, గ్రామ అధ్యక్షుడు నీలం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.