– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ లో గురువారం జరిగిన సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ ఈ నెల 7న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ పట్టణంలో జరుగనున మహాసభ కి సంబంధించిన కరపత్రాలు,గోడ పత్రికల ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ మహాసభ విజయవంతం కోసం తెలుగు రాష్ట్రాల్లోని బీసీ లే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున ఓబీసీలు పాల్గొంటారని, ఈ మహాసభ లో కేంద్ర మంత్రులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని అన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే కులాగణన లో బీసీ కులగణన చేపట్టాలని,చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని,దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కేంద్రానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు స్లాబ్ కోట ఇవ్వాలని అన్నారు. విధ్యా,ఉద్యోగ రంగాలలో క్రిమిలేయర్ ని ఎత్తివేయాలని,దేశ జనాభాలో 60 శాతం మంది ఓబీసీలు ఉంటే కేంద్రం కేవలం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేసి అన్యాయం చేస్తుందని,జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.ప్రైవేటు రంగంలో,న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని,అన్ని రంగాల్లో బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.సంతోష్,యోగేష్,అరవింద్,సాయి విజ్ఞేష్,శశి కుమార్,రాజు,ధనరాజ్,ప్రమోద్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.