పుట్టింది ధనిక వర్గంలో పోరాడింది పేదల పక్షాన
నిర్విరామంగా కడదాకా! కమ్యూనిస్ట్‌గా
వర్గ పోరాటమే లక్ష్యంగా
సాగే మార్క్సిజాన్ని అధ్యయనం చేయడమే నీ బాట!
కులం వర్గపోరాటానికి అడ్డంకి అని తేల్చేసావ్
సామాజికార్ధిక పోరాటాలు కలిసి సాగాలన్నావ్
ఎమర్జెన్సీలో అజ్ఞాతంలో నీవు
ఎర్రజెండానే నీ లక్ష్యం దిశగా
నీవేసిన అడుగులు సైద్ధాంతిక మనుగడ వైపు
మద్రాస్ నుండి ఢిల్లీ వయా హైదరాబాద్
చదువుతూ పోరాడు చదువుకై పోరాడు
నినాద హోరు
జె.ఎన్.యు లో నీ ప్రస్థానం!
ఇందిర రాకను అడ్డుకున్న యువరక్తం నాడు!
సమకాలీన రాజకీయ పరిస్థితులకనుగుణంగా
సౌమ్యంగా లౌక్యంగా
చట్టసభలో మీ వాణి చిరస్మరణీయం!
ఫాసిస్టు పాలనను నిర్ద్వందంగా నిరసించిన ధైర్యం నీ సొంతం!
చర్చా వేదికలు
ముసాయిదా రూప కల్పనలు
ఎర్ర సిరా కలం చివరంటా సంపాదకీయాల వ్రాసింది!
పాత్రికేయమంటే ఏంటో
పార్లమెంట్ గోడల బద్దలు కొట్టినట్లు రుచి చూయించావ్!
కామ్రేడ్! అందుకో ఎఱ్ఱెర్రని దండాలు!
ఏనాటికైనా కూడు పెట్టేది ఎర్రజెండా నే!
నీ బాటలో మేం!!
– గిరి ప్రసాద్ చెలమల్లు, 9493388201