హలొ మాదిగ చలో ఢిల్లీ ఆగస్టు 9న మాదిగల మహా ధర్నా విజయవంతం చేయాలని ఎమ్మార్పీ ఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుర్రాల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం తొగుట మం డల కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదిగ కులాల ప్రజలారా, విద్యా వంతులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులారా కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సి లను ఏబిసిడిలుగా విభజిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మాదిగ దండోరా సభలకు బిజెపి అగ్రనాయకత్వం ఎస్సీల లో 59 కులాలు రిజర్వేషన్ సమాన పంపిణీ జరపాలని, దీనికి బిజెపి పార్టీ కట్టుబడి ఉందని నమ్మబలికరని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ఒక దశాబ్దం కాలం పరిపాలించిన ఎస్సి వర్గీకరణ చేయలేకపోయింది ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల ఓట్ల మీద ఉన్న ప్రేమ ఎస్సి వర్గీకరణ పై చూపలేదుని, ఎస్సి వర్గీకరణ చేయక పోవడం వల్ల మాదిగ కులాల ప్రజలు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో పూర్తిగా అన్యాయం జరుగుతుందని తెలిపారు.
స్వయంగా మాదిగల సభల వేదిక పైన కీర్తిశేషులు సుష్మ స్వరాజ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి లు ఎన్నోసార్లు వర్గీకరణ విషయంలో మాట్లాడారని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో జరిగిన మాదిగ దండోరా సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని మాదిగ ఉపకులాల ప్రజలు ఎంతో సంతోషపడ్డారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 29 సంవత్సరాల వర్గీకరణ కోరిక నెరవేరుతున్నదని ఆశించిన తరుణంలో నరేంద్ర మోడీ ఆ సభలో మాట్లాడకుండా మీ వెనుక నేనున్నాను, ఎస్సి వర్గీకరణ విషయంపై కమిటీ వేస్తానని చెప్పడం దేశంలో ఉన్న మాదిగల అందరిని ఆశ్చర్యానికి గురిచేయడం బాధాకరం అన్నారు. గతంలో వేసిన కమిషన్ (కమిటీ) లోకూర్ కమిషన్, రాంచందర్ రాజ్ కమిషన్, ఉషా మెహ్రా కమిషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగ, ఉప కులాల ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని వీరినీ ఏబిసిడి లుగా విభజించాలని పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఏమి ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతిభ్రమించి మాదిగలను, మాదిగ ఉపకులాల ప్రజలను మోసం చేసే ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీటీసీ ఎలుపుల స్వామి ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు జంగాపల్లి సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి లింగాల స్వామి, తొగుట మండల అధ్యక్షుడు రాంపురం రమేష్, కొమ్ము రాజయ్య, ఎడ్ల గోపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.