– దుబ్బాకలో వాల్ పోస్టర్లు విడుదల
నవతెలంగాణ – దుబ్బాక
ఈనెల 7 న హైదరాబాద్ లో జరిగే “లక్ష డప్పులు వేల గొంతుకల” భారీ సాంసృతిక కార్యక్రమానికి మాదిగలు మాదిగ ఉప కులాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాదిగ,ముంబాయి శ్రీను మాదిగ కోరారు.ఈ మేరకు శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇస్తారిగల్ల స్వామి,బెల్ల రమేష్,ఎంఎస్ పీ ఉపాధ్యక్షులు చెక్కపల్లి మహేష్,డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ సంఘం అధ్యక్షులు చెక్కపల్లి రాజమలు మాదిగ,చెక్కపల్లి పద్మయ్య మాదిగ, బండమీది మల్లయ్య మాదిగ, దుబ్బాక పరశురాములు, మరాటి కుమార్, మరాటి బాబు, ఇస్తారి గల్ల చరణ్ పాల్గొన్నారు.