– నవంబర్ 6న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ
– ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ హాజరు
– ఎమ్మార్పీఎస్ షాద్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పెంట నోళ్ల రవికుమార్ మాదిగ
నవతెలంగాణ – కొత్తూరు
నవతెలంగాణ – కొత్తూరు
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 6న జరిగే మాదిగల మహా ధర్మ యుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ షాద్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పెంట నోళ్ల రవికుమార్ మాదిగ పిలుపునిచ్చారు. తుక్కుగూడలోని శ్రీకాళహస్తి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, అనుబంధ సంఘాల నాయకులు సభ విజవంతం చేయడానికి కార్యాచరణ చేపట్టాలని కోరారు. షాద్నగర్ నియోజకవర్గం లోని ప్రతి మండలం నుండి మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.