విభిన్నమైన టైటిల్‌తో, వినసొంపైన పాటలతో ఇటు ఇండిస్టీలో, అటు ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయనమః’. ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రావుల రమేష్ క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి పబ్ సాంగ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లాంచ్ చేశారు. ‘హల్లో హల్లో మీమ్స్ వాలా…పుల్‌గా ఫోకస్ ఆన్ మీ రో..’ అంటూ సాగే ఈ పబ్ సాంగ్‌ను సురేష్ గంగుల రచించగా, జాన్ భూషణ్ స్వరపరిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ, ‘తలసాని చేతుల మీదుగా మా చిత్రంలోని పంబ్ సాంగ్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.
‘ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ పాట రాయించి, పిక్చరైజ్ చేశాం. క్రేజీ లిరిక్స్‌తో పాటు ట్రెండీ మ్యూజిక్‌తో ఈ పాట ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే సినిమా ఇది’ అని దర్శకుడు పాలిక్ చెప్పారు. ‘ఓ మంచి సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని నాయకానాయికలు వెంకట్, మోహన సిద్ధిఖి చెప్పారు.