వాహనాలలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి 

Helmets must be worn in vehiclesనవతెలంగాణ – మోర్తాడ్ 

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై విక్రం అన్నారు. మండలం దొనకల్ గ్రామంలో ప్రజలతో ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదారులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ద్విచక్ర వాహనంపై రహదారి వెంట వెళ్లేటప్పుడు భారీ వాహనాల ద్వారా ప్రమాదాలకు గురై ఇచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణ రక్షణకు పాల్పడాలని అన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమకు సహకరించాలని అన్నారు. అనంతరం ధర్మోరా పాలెం వాగు  ప్రవహిస్తుందని వాహనదారులు దారి గుండా వెళ్ళకూడదు అంటూ ప్రజలకు సూచించారు. బాగు వెళ్లే దారిలో అడ్డుకట్టను ఏర్పాటు చేశారు.