నవలంగాణ – శాయంపేట
మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయితెన కరుణాకర్ తండ్రి పల్లెబోయిన సాయిలు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించారు. కర్ణాకర్ తో పాటు 2003-04 లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు విషయం తెలుసుకొని 20వేల నగదు జమ చేశారు. శనివారం పూర్వ విద్యార్థులు సందర్శించి సాయిలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, 20వేల నగదు ఆర్థిక సహాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వేణు, శ్రీనివాస్, సుమన్, శివాజీ, ప్రవీణ్, పరిపూర్ణచారి, ప్రశాంత్, తిరుపతి, మహేందర్ పాల్గొన్నారు.