18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులతో ఓటు నమోదుకు సహకరించాలని, గ్రామాల వారీగా యువతను ఓటు నమోదు చేసుకునేలా దృష్టి సారించే లా రాజకీయ పార్టీల ప్రతినిధులు స్థానిక ఎన్నికల అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ వేణు గోపాల్ రాజకీయ పార్టీ నేతలకు సూచించారు. ఈ నెల 20 వ తేదీ వరకు ఇంటింటి ఓటరు సర్వే జరుగుతోందని చెప్పారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అయన ఓటరు జాబితాపై పునరుద్దరణ పై రాజకీయ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త ఓటు నమోదు తో పాటు చేర్పులు,మార్పులు,తొలగింపుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.మృతి చెందినా,రెండు చోట్ల ఓట్లు నమోదైనట్లు గుర్తించి తమ దృష్టికి తీసుకొస్తే తొలగిస్తామని తెలిపారు. ఇప్పటికే బీఎల్వోలు చేపట్టిన ఇంటింటి సర్వే 51 శాతం పూర్తి అయ్యిందని ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల సహాకారం కూడా అవసరం ఉందని ఆయన అన్నారు. సమావేశం లో తాహశిల్దార్ కృష్ణ ప్రసాద్,సీపీఎం,సీపీఐ టీఆర్ఎస్, కాంగ్రెస్,నాయకులు కె.పుల్లయ్య,బి.చిరంజీవి నాయకులు రామకృష్ణ, యూఎస్.ప్రకాశ్ రావు, సత్యవరపు సంపూర్ణ,చిన్నంశెట్టి సత్యనారాయణ,తుమ్మ రాంబాబు,ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.