మాజీ చైర్ పర్సన్ కు సన్మానం

నవతెలంగాణ -దుబ్బాక
దుబ్బాక మున్సిపాలిటీ తాజా మాజీ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి దంపతులను శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో
మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఐదేళ్లుగా మున్సిపల్ అభివృద్ధి,బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ చైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి ని సన్మానించడం జరిగింది. మాజీ మంత్రి జగదీష్,మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నారు.