– ఉద్యోగులు అందుబాటులో ఉండండి
– ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు స్థానికంగా ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో 45 సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజక వర్గం పరిధిలో ఉన్న లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు , పోచారం కలిసి బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. నదులు, వాగులు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల దగ్గరకు వెళ్ళవద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చెయ్యకుడదన్నరు. ప్రజలు, రైతులు చిన్న పిల్లలు కరంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దన్నారు. చిన్న పిల్లలను ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వద్దన్నారు రైతులు తమ పంట పొలాలలో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించలని సూచించారు.
నిజాంసాగర్ లోకి వరద నీరు వస్తుంది..
నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన భారీ వర్షాలు కురవడంతో వర్ధనీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి పోచారం, ఘనపూర్ ల నుండి ఇన్ ఫ్లో వస్తున్నందున్నారు. ప్రస్తుతం 8600 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. 4.976 టీఎంసీల సాగునీరు ఉందన్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరి వెంట రాష్ట్ర గ్రూప్ చైర్మన్ కాసుల బాలరాజ్ కిష్టారెడ్డి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.