
మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన గుండ్ల శ్రావణ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ నాలుగు నెలలకు సరిపోయే మందులను ఇప్పించారు . పేద కుటుంబానికి చెందిన బాధితుడు కొంతకాలం క్రితం గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్నాడు. ప్రతినెల మందులకు ఇబ్బంది అవుతుండడంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించగా ఆయన నాలుగు నెలలు సరిపోయే మెడికల్ మందులను ఇప్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బూరెడ్డి సంతోషం, కోరాడి రాజు, కోరాడి లింబాద్రి, బద్ది అవినాష్,ఓరగంటి నరేష్, బషీర్ రాజు,సాగర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు