ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటా…

– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్.
నవతెలంగాణ – ఊరుకొండ 
ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాత్లవత్ గిరి నాయక్ అన్నారు. మంగళవారం ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన ఎండి.షాబుద్దీన్(45) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పేదల పెన్నిధి, బడుగు బలహీవర్గాల ఆశాజ్యోతి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్  బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. 5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కరాటి బాలు నాయక్, అరుణ్ కుమార్, వెంకటస్వామి గౌడ్, రవి నాయక్, హుస్సేన్, శంకర్ బాబు, ప్రశాంత్ నాయక్, మాడుగుల రాములు, హరి నాయక్, కృష్ణయ్య శ్రీనివాసులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.