ఇటు పదవులు.. అటు చేరికలు

ఇటు పదవులు.. అటు చేరికలునవతెలంగాణ-శేరిలింగంపల్లి
సార్వత్రికల ఎన్నికప్పుడు శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఒకరు బీఆర్‌ఎస్‌ నుండి, మరొకరు కాంగ్రెస్‌ నుండి పోటీ పడ్డారు. కానీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవగా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇన్‌చార్జి గా ఉన్నాడు. కాగా గత కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా కాం గ్రెస్‌లో చేరుతాడు అనే ఊహగానాలు వచ్చినప్పటి నుండి పాత కాంగ్రెస్‌ వర్గం ఎమ్మెల్యే వర్గం పార్టీలో చేరితే ‘మా ప్రాధాన్యత తగ్గుతుంది’ అని ఒకింత ఆందోళనతో ఉండే వారు. రాను రాను వారిలో వైరాగ్యంతో పాటు, కోపం పెరుగుతూ వచ్చింది. దీంతో వారి ప్రాధాన్యత తగ్గకుండా ఉండడం కోసం తరుచు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కలుస్తూ, ప్రజలతో కలిసి బస్తిల్లో తిరిగేవారు. కానీ ఎట్టకేల కు ఎమ్మెల్యే గాంధీ వర్గం కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో అయ న వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇన్‌చార్జిగా ఉన్న జగదీశ్వర్‌ గౌడ్‌ ఇటు నియోజకవర్గంలో నామినేటెడ్‌ పదవులు కేటాయించాడు. ఎన్నికల తర్వాత చాలా నామినేటెడ్‌ పదవులు తెచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం వచ్చిన ఎంపీ ఎన్నికలప్పుడు కూడా చాలా మం ది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేతో పాటు నలుగురు కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో జగదీశ్వర్‌ గౌడ్‌ వర్గం ఒకింత నిరుత్సాహానికి లోనైనట్లు కొందరు నాయకులు తెలిపారు. దీంతో తన ప్రభావం తగ్గకుండా ఉండకుండా చూసుకోవడం కోసం నామినేటెడ్‌ పదవులు ఇస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేతో పాటు పలువురు…..
కాంగ్రెస్‌ ఊపులో కూడా బీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు, గ్రేటర్‌ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ఇప్పటికే చేరగా, ఇప్పుడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులు బీర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కొత్తవాళ్లు, పాతవాళ్ళు అనే గ్రూపులుగా తయారయ్యారు. ఇద్దరినీ అధిష్టాన వర్గం ఎలా సమన్వయం చేస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఒకప్పుడు టీడీపీలో పనిచేసినవారే కాబట్టి ఇద్దరు మిత్రులు కావడం విషయం. ఆ పాత స్నేహాన్ని దష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేకు ప్రాధాన్యతనిస్తా డా, లేక ఎన్నికలకు ముందే వచ్చిన వ్యక్తి కి ప్రాధాన్యత నిస్తాడా అనేది వేచి చూడాలి.