
హైదరాబాద్ మణికొండలోని కేయం గుప్తా హోటల్లో 10 మంది దుబ్బాక పట్టణ విద్యార్థులకు ప్రముఖ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారని ఆర్ట్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ ఇండియా ఫౌండర్ అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక పట్టణం నుంచి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ గెలుచుకొని విద్యార్థులు తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది అన్నారు. బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ తీసుకున్నవారు లచ్చపేట మోడల్ స్కూల్, కే.హర్షవర్ధన్, బి.శ్రీకర్ గౌడ్, పి.గౌతమి. దుబ్బాక గాయత్రి వివేకానంద విద్యాలయం వి.ఆకాష్,సిహెచ్ నవనీత్. సిద్దిపేట్ శ్రీ చైతన్య స్కూల్ ఎస్.మనస్విని, ఎస్.అక్షయ, ఈ.లాస్య శ్రీ దీప్తి. అంబిటాస్ స్కూల్ ఏ.వర్షిని రెడ్డి, ఏ.యశ్వంత్ రెడ్డి అని తెలిపారు. ప్రతి మహిళలు తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలని హీరో సుమన్ అన్నారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే కరాటే వల్లే సాధ్యమన్నారు.స్కూల్లలో కాలేజీల్లో వారానికి రెండు తరగతులు ఉంటే మహిళలు తమకు తాము కాపాడుకుంటారని తెలిపారు.