
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ని శనివారం సిద్దిపేటలోని హోటల్ మినర్వల్ లో హెచ్ హెచ్ పి లు కలిశారు. కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులలో పని చేస్తున్న టెక్నీకల్ మేనేజర్ (హెచ్.హెచ్.పి )లు గత 23 సoవత్సరాలుగా పనిచేస్తున్నామని తెలిపారు.తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యేలా కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేసా జిల్లా అధ్యక్షులు ఏ.ఆర్.రహమన్, ప్రధాన కార్యదర్శి రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.