హాయ్ మామ… మా చల్లని చందమామ

అమ్మ గోరుముద్దలు పెడుతూ
మామ వస్తాడు కొండెక్కి వస్తాడు
నీకు బహుమానం తెస్తాడు
అని అన్నం పెడితే
మా ఎదుగుదలకు మా కంటి నిద్రకు
నీవు కారణమయ్యావు జాబిలి

ఈరోజు ప్రపంచం ముందు
మా నూట నలభై కోట్ల ప్రజల
విజ్ఞాన వికాసాన్ని
మా జ్ఞాన పరిమళాన్ని మా ప్రజ్ఞను
ప్రపంచానికి చూపించుటకు
నీవు మా విజ్ఞాన కాంతివయ్యావు

ఓ వెలుగు వెన్నెల
ఓ చల్లని జాబిలి
నువ్వు రాక
మా కల కల గాక
మేము నిన్ను మరవక
చంద్రయాన్‌ 3 ప్రయోగంతో
మా ఇస్రోతో విశ్వాన్ని చుట్టి
మా ల్యాండర్‌ విక్రంతో ల్యాండ్‌ అయ్యి
విజయం పొంది
మా అమ్మల కలలను నిజము చేసి
జాబిలిపై మా జాడలు
ప్రపంచానికే మా విజ్ఞాన రేఖలుగా చూపుతూ

మా ర్యాడర్‌ ప్రగ్యాన్‌ అస్త్రంతో
నీతో పోరుచేసి
నిన్ను శోధించి
నీ విలువను ప్రపంచానికి చూపుతూ
మా జ్ఞాన తత్వమును
మా ఘనతను చాటుతాము

మామ ఓ చందమామ
మేము నీపై ఉన్నంతవరకు
మమ్మల్ని ఓడించేవారు లేరు మామ
నీతో మా ప్రయాణం
మా భారత జాతికి గర్వకారణం
ప్రపంచానికే మా దేశం ఆదర్శం
మా శాస్త్రవేత్తల ప్రజ్ఞకు
ప్రపంచమంతా చెందెను విస్మయము
మా భారత జాతి కీర్తి నింగికెగిసెను
మా కల సాకారమయ్యెను
జయహో భారత్‌ …విజయహో భారత్‌

– తెలుగు తిరుమలేష్‌ (సవ్వడి),
9908910398