హైదరాబాద్ : హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తొలి ఎడిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను టీఎస్‌ఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఇ వెంకట్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ప్రాజెక్ట్స్ సీఈఓ వి ముధుసూదన్, హైబిజ్ టీవీ, తెలుగు నౌ ఎండీ ఎం రాజగోపాల్, సీఈఓ సంధ్యా రాణి పాల్గొన్నారు. ఈ అవార్డుల ప్రదానం 2023 సెప్టెంబర్ 11న హైటెక్స్‌లో నిర్వహించనున్నారు.