నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ పరిధిలోని కోమటికుంట చెరువులో ‘వాసవి ఇన్ ఫ్రా’ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. చెరువుకు చెందిన బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేస్తోందంటూ నగరానికి చెందిన సతీష్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరథే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. బఫర్‌జోన్‌లో నిర్మాణాల వ్యవహారంపై ఆధారాలను అందజేయాలని పిటిషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఆదేశించింది. నిర్మాణాలను నిలిపివేయాలన్న ఉత్తర్వులను వాసవీ ఇన్‌ఫ్రా సవాల్ చేసిన పిటిషన్‌ను కూడా విచారించింది. వీటిపై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపడుతున్నామని వాసవి వాదించింది. దీనిపై హెచ్‌ఎండిఏను హైకోర్టు వివరణ కోరింది.