మండలంలోని ఇ సన్న పల్లి (రామారెడ్డి) లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని శనివారం తెలంగాణ హైకోర్టు జడ్జ్ శ్రీనివాస రావు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు, సిబ్బంది శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి కోర్టు జడ్జీలు, ఆర్డిఓ రంగనాథ రావు, స్థానిక ఎమ్మార్వో లక్ష్మణ్, ఆలయ సిబ్బంది సురేందర్, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, సిబ్బంది నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.