గ్రూపు-1 పరీక్షలను వాయిదాకు హైకోర్టు నిరాకరణ

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఈనెల 9న జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలంటే దాఖలైన పిటీషన్లపై ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ప్రిలిమ్స్‌ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన కారణంగా వాటిని వాయిదా వేయడానికి ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్‌ కార్తీక్‌ స్పష్టం చేశారు పిటీషన్‌ పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్రం నిర్వహించే పరీక్షకు హాజరయ్యేది 700 మంది మాత్రమేననీ, ప్రిలిమ్స్‌ కు హాజరయ్యే అభ్యర్థులు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నారని, పరీక్షలు వాయిదా వేయడానికి వీల్లేదని సర్వీస్‌ కమిషన్‌ న్యాయవాది చేసిన వాదనను ఆమోదించారు.