ఐరోపాలో కరెంటు బిల్లుల మోత

గ్రీస్‌ : యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో రష్యన్‌ సహజ వాయువు అందు బాటులో లేనందున ఇంధన ధరలు చుక్క లను తాకుతున్నాయి. దీనితో శీతా కాలం నాటికి గృహాలకు సరఫరాచేసే కరెంటు చార్జీలు విపరీతంగా పెరగను న్నాయి. ఇటలీలో ఆగస్టు21 నుంచి 27 మధ్యలో కరెంటు చార్జీలు 30శాతం పెరిగాయి. నోమిస్మా ఎనర్జియా అనే రీసెర్చ్‌ గ్రూపు అంచనా ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి ఇటలీ కుటుంబాలు 7నుంచి 10శాతం అధికంగా కరెంటు చార్జీలను భరించవలసి వుంటుం ది. గ్యాస్‌ ధరలు పెరగటంవల్లనే ఇటు వంటి పరిస్థితి ఏర్పడిందని నోమిస్మా ఎనర్జియా పేర్కొంది. శీతాకాలం నాటికి అంతర్జాతీయ ఇందన ధరలు 40శాతం పెరుగుతాయని, కరెంటు చార్జీలు 20 శాతం దాకా పెరగటం అనివార్యమని నోమిస్మా ఎనర్జియా అధ్యక్షుడు డేవిడ్‌ తబ రెల్లీ ప్రకటించారు. అలాగే గతవారంలో ఎస్టోనియాలో కరెంటు బిల్లులు 93శాతం పెరిగాయి. లత్వియా, లిథ్యూనియా దేశాలలో కూడా కరెంటు బిల్లులు 23శాతం పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు, గ్యాస్‌, బొగ్గు దిగుమతులను నిషేధించాలనే నిర్ణయం పర్యవసానంగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో ఇందనంపైన చేస్తున్న వ్యయం విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలందాకా ఫ్రాన్స్‌ విద్యుచ్చక్తిని ఎగుమతి చేసేది. గత శీతాకాలంలో పొరుగుదేశాల నుంచి ఫ్రాన్స్‌ కు విద్యుచ్చక్తిని దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్‌ విద్యుచ్చక్తి ఉత్పత్తిలో 70శాతం న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటుల నుంచే వస్తుంది. వీటిలో చాలావరకు మెయింటెనెన్స్‌ కి వచ్చి నిరూపయోగంగా పడివుండటంతో బొగ్గుతో విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయాలని సోమవారంనాడు ఫ్రాన్స్‌ నిర్ణయించింది.