– యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 59 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో 49 రెవిన్యూ శాఖ, జిల్లా పంచాయితీ శాఖ 2, సాంఘిక సంక్షేమ శాఖ 2, జిల్లా గ్రామీణాభివృద్ది, పశు సంవర్ధక, విద్యా, మున్సిపాలిటీ, రవాణా, ఖనిభూగర్భ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రజావాణిలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ. కృష్ణన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు జయశ్రీ, కలెక్టరేటు సూపరింటెండెంట్ పార్ధసింహ్మారెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.