
నవతెలంగాణ – తాడ్వాయి
పచ్చిరొట్ట ఎరువులు వాడడం ద్వారా మంచి లాభాలు వస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో తో కలిసి పచ్చి రొట్ట విత్తనాలను అందజేశారు చేశారు. పచ్చిరొట్టపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి జైసింగ్ మాట్లాడుతూ 60% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సేంద్రీయ ఎరువులు వాడడం ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. జీలుగా 30 కిలోల బ్యాగు కు రూ.1116 అని అన్నారు. రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియరులను రైతులు వాడాలని సూచించారు. వ్యవసాయ కార్యాలయంలో పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ కార్డుతో సంప్రదించాలన్నారు. ఈ వానాకాలం సాగు చేసే వారి, మొక్కజొన్న, మిరప పంట రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వ్యవసాయ శాఖ అనుమతి పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు జెస్సి రవికుమార్, భవాని, ఫయాజ్,పి ఏ సి ఎస్ సిఈఓ స్వాతి లు పాల్గొన్నారు.