రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆకాంక్ష హైస్కూల్ విద్యార్థి

నవతెలంగాణ-హాలియా: ఈ నెల 17,18,19,20 తేదీలలో సంగారెడ్డి జిల్లాలో జరగబోయే అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు హాలియా మున్సిపాలిటీకి చెందిన ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థి ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు మేకల బ్రహ్మం ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మోధాల రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు మా పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపిక కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచి నల్లగొండ జిల్లాకు, హాలియా మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని సూచించారు. భవిష్యత్ లో జాతీయ స్థాయికి ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన 10 వతరగతి విద్యార్థి మేకల బ్రహ్మం ను పాఠశాల కరస్పాండెంట్ మేడేపల్లి మోహన్ రావు, డైరెక్టర్ ఉన్నం శ్రీను బాబు పిఈటి ఆవుల చంద్రశేఖర్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని అభినందించారు.