ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు రిలీవ్‌

ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు రిలీవ్‌– నకిరేకల్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ
– ఘనంగా సన్మానించిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు బుధవారం ఆ పదవి నుంచి రిలీవ్‌ అయ్యారు. నకిరేకల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన్ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శ్రీనివాసరావును చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌ ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉన్నత విద్యామండలి తొలి కార్యదర్శిగా ఆయన్ను 2014, జూన్‌లో నియమించిన విషయం తెలిసిందే.
తొమ్మిదిన్నరేండ్లపాటు ఆయన సేవలందించారు. ఆయన చేసిన సేవలను లింబాద్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలి జాయింట్‌ సెక్రెటరీ సిఎస్‌ ప్రకాశ్‌, ఉద్యోగులు, తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఉద్యోగులు పాల్గొని పాల్గొన్నారు.