నిర్లక్ష్యపు నీడలో ‘ఉన్నతవిద్య’

గత పదేండ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నంగా తయారైంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల చూపిస్తున్న వివక్షాయే కారణం. నాడు రాష్ట్ర సాధనలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధా వులు పోరాటాల్లో పాల్గొన్నారు.ఉద్యమానికి ఒక వెన్ను దన్నుగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విద్యావ్యవస్థ నిర్మాణాత్మకంగా తయారవుతుందని అందరూ భావించారు, కానీ దానికి భిన్నంగా ఎన్నో ప్రయివేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలు మూత బడ్డాయి, సుమారు 2860 జూనియర్‌ కళాశాలలు, 1080 డిగ్రీ కళాశాలు మూతబడ్డాయి అందులో పని చేస్తున్న సుమారు 50 వేల నుంచి 60 వేల మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు, దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య అందని ద్రాక్షల తయారైంది. అందుకు ప్రభుత్వం కార్పొరేటు విద్యాసంస్థలను ప్రోత్స హించడమే. నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న విద్యాసంస్థలు చాలావరకు మూతపడ్డాయి.కనీసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు అందిం చాల్సిన స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజులు చెల్లించక విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న పరిస్థితి ప్రత్యక్షం గా కనిపిస్తుంది. గత రెండేండ్లనుంచి విద్యార్థుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారు. ప్రతి ఏడాది సుమారు 12లక్షల50వేల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారికీ కావాల్సిన బడ్జెట్‌ సుమారు రూ.2350 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్రం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కేవలం ఒక శాతం. అయినా అ డబ్బు విద్యా ర్థులకు చేరడం లేదు ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విధంగా ఉంటే విద్యార్థులు ఏ విధంగా పైచదువులకు వెళ్లగలుగుతారు. ఉన్నత విద్యతో పాటు పాఠశాల విద్య అగమ్యగోచరంగా తయా రైౖంది. పాఠశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు పడు తున్న అవస్తలు అన్నీ ఇన్నీ కావు. విద్య, వైద్యం సమా జానికి రెండు కండ్లలాంటివని చెబుతారు. కానీ వాటిని మాత్రం ప్రభుత్వ పెద్దలు పట్టించుకోరు. విద్యార్థులకు ఇంటర్‌ ఫీజు కేవలం రూ.1740, రూ.1940 చెల్లిస్తే కళాశాలల్లో బోధన ఏ విధంగా చేస్తారు. వారి చదువు లకు ఈ ఫీజులు సరిపోతాయా? జీవో 114 ప్రకారం పెంచాల్సిన పది శాతం గత తొమ్మిదేండ్ల నుంచి అసలు పెంచనేలేదు. కార్పొరేట్‌ ఫీజులు మాత్రం రూ.30వేల నుంచి 3లక్షల వరకు పెరిగాయి. ఎలాంటి అడ్డూ అదు పు లేకుండా యాజమాన్యాలు పెంచుకుంటు న్నాయి. కార్పొరేట్‌ సంస్థలకే ప్రభుత్వం అండగా నిలవడం సరి కాదు విద్యార్థులు చేసిన తప్పేంటి? అనాడు తెలం గాణ ఉద్యమంలో విద్యార్థులు ముందువరసలో ఉన్నా రు. పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యా ర్థులు, నిరుద్యోగులు నేడు రోడ్ల మీదకు వస్తున్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చే వారిని గుర్తించి ఎన్నుకుంటే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి.
– గౌరి సతీష్‌, 9989021453