ప్రయివేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఉన్నత అదికారులు పట్టించుకోరా?

– సుమోటోగా తీసుకొని ప్రభుత్వం ఎన్ఐఏ తో దర్యాఫ్తు చేయాలి
– విద్యార్థి జస్విత్ రెడ్డి పోస్టుమార్టం రిపోర్ట్ నూ బహిర్గతం చేయాలి 
– ఎస్ఎఫ్ఐ డిమాండ్ 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఉన్నత అధికారులు పట్టించుకోరా అని, సుమోటాగా తీసుకొని ప్రభుత్వం ఎన్ఐఏ తో దర్యాప్తు చేయాలని, విద్యార్థి జస్విత్ రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్టును బహిర్గతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. కాకతీయ విద్య సంస్ధలో వారం రోజుల కిందట విద్యార్థి మృతి చెందిన జిల్లా విద్య శాఖ అధికారులు ఆ పాఠశాలపై ఇన్స్పెక్షన్ చేయకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు.
ఒక పక్క విద్యార్థి తల్లిదండ్రులు తన కొడుకు చనిపోయాడు అని బాధలో ఉంటే కాకతీయ విద్య సంస్థలు కేసు వాపసు తీసుకోవాలని బెదిరించడం సరికాదు అని అన్నారు. అదే విధంగా ప్రభుత్వం సుమోటాగా ఈ కేసును తీసుకొని ఎన్ఐఏతో దర్యాప్తు చేయాలనీ డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు కాకతీయ విద్య సంస్థల గుర్తింపును రద్దు చేయాలని అన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని అదే విధంగా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, నాయకులు దినేష్ వీణా, చక్రి తదితర నాయకులు పాల్గొన్నారు.