– ఏఐఎస్‌ఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్ లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులివ్వాలని కోరారు. తెలంగాణ విభజన హామీల ప్రకారం ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయంతో పాటు ఐఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్లుగా మోడీ సర్కార్ , రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ సర్కార్ విద్యను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. అంగన్‌వాడి కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ఈ నిర్ణయం వల్ల బీజేపీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ని రాష్ట్రంలో అమలు చేసినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.