హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామ కష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ, ‘ఇందులో చాలా కొత్త పాయింట్, ఐడియాని చెప్పాం. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్‌కి కట్టుబడి
ఉండిపోతాం. అలా ఒకటే జోనర్‌కి పరిమితం కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా చేశాం. ఖచ్చితంగా అందరూ ఎంటర్ టైన్ అవుతారు. మేము చెప్పే కొత్త పాయింట్ రివీల్ అయినపుడు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఆ సమయానికి కథలో మా పాత్రల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం హిలేరియస్‌గా ఎంజారు చేస్తారు. ఇందులో మిస్టరీ, థ్రిల్, ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇవన్నీ ఎలా వర్క్ అవుట్ అవుతాయో ప్రేక్షలులు చూస్తున్నపుడు తెలుస్తుంది. అయితే ఎంటర్ టైన్మెంట్ పక్కాగా వుంటుంది. మిగతావన్ని బోనస్‌గా భావిస్తాను’ అని చెప్పారు.