కొండంత ప్రచారం.. గోరంత భరోసా..

Hill campaign.. Hill assurance..

– పంట ఋణ గ్రహీతలు 6500

– లక్ష లోపు లబ్ధి దారులు 1780
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల ముందు చెప్పిన మాటలకు గెలిచాక చేసే పనులకు అసలు పొంతనే ఉండదు అని చెప్పడానికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు ఋణ మాఫీ మంచి ఉదాహరణ.హామీలు ఇచ్చేటప్పుడు ఏ ప్రమాణాలు లేకుండా ఓటర్లను ఊరించి,ఓట్లు వేయించుకున్న నాయకులు గెలిచాక అమలు చేసే సమయంలో ఈ పథకానికి ఇవీ అర్హతలు అంటూ ప్రకటిస్తున్నారు.రైతు ఋణం మాఫీ పై కొండంత ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టాక గోరంత బరోసా ఇవ్వడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం ఋణ మాఫీ అమలు రైతులను,బ్యాంకర్ లను,వ్యవసాయ అధికారులను అయోమయం పాలు చేస్తుంది.ఎవరి దగ్గరా సరైన సమాచారం లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ బ్యాంకర్ లు. చుట్టూ తిరుగుతున్నారు. అశ్వారావుపేట మండలంలో సుమారుగా మొత్తం 6429 పంట ఋణ గ్రహీతలు ఉన్నారు.అయితే ప్రభుత్వం 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ మధ్యకాలంలో పంట ఋణం తీసుకున్న వారు అర్హులు గా తేల్చింది.ఇందులో మొదటి దఫా లక్ష లోపు ఉన్న వారు 1780 మంది గా నిర్ధారించింది. ఇందులో గురువారం నాటికి రూ.1 లక్ష లోపు  1765 మంది పంట ఋణం పొందిన వారికి ప్రభుత్వం ఋణమాఫీ క్రింద బ్యాంక్ లకు జమ చేసినట్లు మండలంలోని బ్యాంక్ మేనేజర్లు తెలిపారు. అశ్వారావుపేట మండలం లో ఎస్ బీఐ 2,యూబీ 2,ఏపీజీవీబీ 2,పీఏసీఎస్ 2,డీసీసీబీ 1 మొత్తం 9 బ్యాంక్ లు ఉన్నాయి. ఆయా బ్యాంక్ మేనేజర్ లు తెలిపిన వివరాలు ప్రకారం.
బ్యాంక్                         అర్హులు       లబ్ధిదారులు
ఎస్ బీఐ (స్కేల్ 3)           298               79
ఎస్ బీఐ (స్కేల్ 2)            36                05
యూబీ (ఏఎస్పీటీ )         800              152
యూబీ(వి.పురం)            500              384
ఏపీజీవీబీ(ఏఎస్పీటీ)        600              325
ఏపీజీవీబీ (వి.పురం)      1350             258
పీఏసీఎస్ (ఏఎస్పీటీ)       1241           249
పీఏసీఎస్ (నా.పురం)     1604             313
మొత్తం                       6429         1765