నూతన తహసీల్దార్ గా హిమబిందు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని కొత్తగా వచ్చిన తహసీల్దార్ హిమబిందు శుక్రవారం నాడు పదవి బాద్యతలు తీసుకోగా, బదిలీ పైన వెళ్తున్న తహసీల్దార్ గంగాసాగర్ ను రివేన్యు కార్యాలయ అధికారులు ఇద్దరిని ఘణంగా సన్మాన కార్యక్రమం నిర్వహించామని ఆర్ఐ రామ్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా కొత్తగా వచ్చిన ఎమ్మార్వో హిమబిందు మాట్లాడుతు మారుముల జుక్కల్ మండలంలో  రివేన్యు సమస్యలు లేకుండా తనవంతుగా కృషి చేసి అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం పదవి  బాద్యతలు తీసుకున్న వారికి స్వాగతం పలికి శాలువాతో రివేన్యు సిబ్బంది సన్మానించారు. అధేవింగంగా బగిలి ఎస్ఎస్ నగర్ కు వెళ్తున్న గంగాసాగర్ ను విడ్కోలు పలుకుతు సన్మానించారు.మండల ప్రజలు సున్నితమైన వారని మరువలేనని మంచి సంస్కారం కల్గిన వారని బదిలి వెల్తున్న ఎమ్మార్వో  పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త జుక్కల్ ఎమ్మార్వో హిమబిందు , పాత ఎమ్మార్వో గంగాసాగర్, ఆర్ఐ రామ్ పటేల్, కంప్యూటర్ ఆపరేటర్ నాగ్ నాథ్, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.