నవతెలంగాణ-హైదరాబాద్ : రీ-హైడ్రేషన్ మరియు అలసటను ఎదుర్కొనేందుకు యాపిల్, ఆరెంజ్ రుచులలో తన తాజా ఉత్పత్తి హిమాలయ రీ–హైడ్రేట్‌ను భారతదేశంలోని ప్రముఖ వెల్‌నెస్ బ్రాండ్‌లలో ఒకటైన హిమాలయ వెల్‌నెస్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రోలైట్ పానీయం, శరీరం కోల్పోయిన పోషకాలను వేగంగా తిరిగి భర్తీ చేసేందుకు తయారు చేయగా, వినియోగదారులకు తాజాదనాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. హిమాలయా రీ-హైడ్రేట్‌ను ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగృతి కలిగిన వ్యక్తుల కోసం సైంటిఫిక్గా 40% తక్కువ మొత్తంలో చక్కెర మరియు 50% కన్నా ఎక్కువ విటమిన్ సి*తో తయారు చేశారు. అలసట నుంచి త్వరగా కోలుకునేందుకు విటమిన్ సి సహాయపడుతుంది. కాగా, తక్కువ మొత్తంలో చక్కెర ఉండడంతో వివేకం కలిగిన నేటి తరం వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుంది. జింక్‌తో పాటు సోడియం, క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి ఐదు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌ల మిశ్రమాన్ని కలిగి ఉండటం వల్ల హిమాలయా రీ-హైడ్రేట్ ద్వారా శరీరానికి ముఖ్యమైన పోషకాలు వేగంగా అందుతాయి. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉసిరి మరియు దానిమ్మ వంటి సూపర్ ఫ్రూట్స్ మిశ్రమం శరీరం సహజ పునరుద్ధరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. నూతన ఉత్పత్తి గురించి హిమాలయ వెల్నెస్ కంపెనీకి చెందిన బిజినెస్ హెడ్–ఓటీసీ వికాస్ బన్సీ మాట్లాడుతూ, ‘‘హిమాలయ రీ-హైడ్రేట్ ద్వారా ప్రకృతిలోని మంచితనాన్ని, సైన్సు అందించే హామీతో మిళితం చేసే పునరుజ్జీవన పరిష్కారాన్ని వినియోగదారులకు అందించడమే మా ప్రయత్నం. మా వినూత్న సూత్రీకరణ, నాణ్యత పట్ల తిరుగులేని నిబద్ధతతో ఆరోగ్య పానీయాల మార్కెట్‌లో ఈ వర్గంలో వృద్ధి పథాన్ని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని వివరించారు.