సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ‘హైందవ’

'Hindava' in a new backdropహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నూతన దర్శకుడు లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మూన్‌షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై మహేష్‌ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తున్న ఈ కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌ ద్వారా సినిమా టైటిల్‌ను లాంచ్‌ చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమా చిత్రీకరణ 35% పూర్తయింది.
‘ఒక దట్టమైన అడవిలో ఉన్న పవిత్రమైన దశావతార ఆలయానికి కొంత మంది దుండగులు నిప్పు పెట్టి, నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని ఆడ్డుకునేందుకు హీరో సాయి శ్రీనివాస్‌ బైక్‌తో ఇచ్చే ఎంట్రీ, అలాగే హీరో చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆలయంలోని నాగదేవత (ఆదిశేష అవతారం)కి అద్దం పట్టడం వంటి తదితర అంశాలతో టైటిల్‌ గ్లింప్స్‌ ఆద్యంతం ఆసక ్తకరంగా ఉంది. అంతేకాకుండా ఆకాశంలో శ్రీ విష్ణువు బహుళ రూపాలు కనిపిస్తాయి. చివరగా, హిందూయిజం సారాంశంతో ప్రతిధ్వనించే ‘హైందవ’ టైటిల్‌ను రివీల్‌ చేశారు.