పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో హిందీ దివస్ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ హిందీ భాషకు సంబంధించిన యాక్టివిటీస్ హిందీ డాన్స్ హిందీ పాటలతో విద్యార్థులందరూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ టీచర్ సృజన మాట్లాడుతూ హిందీ భాష అందరూ నేర్చుకోవాలని అది మనకు భవిష్యత్తులో ఎంతో గానే ఉపయోగపడుతుందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు అంతేకాకుండా హిందీ మన జాతీయ భాష అని 1949లో ప్రభుత్వం అధికార భాషగా ప్రకటించిందని అప్పటినుండి మనము సెప్టెంబర్ 14న హిందీ దివస్ వేడుక చేసుకుంటామని విద్యార్థులకు హిందీ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ చక్కగా డాన్సులు చేశారు అంతేకాకుండా హిందీ బోధిస్తున్నటువంటి హిందీ టీచర్లను పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపల్ దాసు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.