మర్పల్లి మండలంలో ఘనంగా హిందీ భాష దినోత్సవం

నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని భూచ న్‌పల్లి, రావులపల్లి, పట్లూర్‌, తదితర ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భూచన్పల్లి పిఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌, పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు నుస్రత్‌ ఫాతిమా విద్యార్థులతో విభిన్న రకాల హిందీ కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రావులపల్లిలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్‌,హైస్కూల్‌ ఉపాధ్యాయులు ప్రేమ్‌ కుమార్‌, మేరీ, పుష్పకుమారి, రాజేందర్‌, రావులపల్లి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.