దేశ ఐక్యతను చాటి చెప్పేది హిందీ భాష అని హిందీ ఉపాధ్యాయులు జి. తిరుపతిరెడ్డి అన్నారు. 14 సెప్టెంబర్ జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల సిద్దిపేటలో ఘనంగా ముందస్తు హిందీ దినోత్సవం నిర్వహించరు. పాఠశాల విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాస, వ్యాసరచన, నాటిక, కవితా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాషా దేశ సమైక్యత, సమగ్రతను చాటుతుందని, ప్రజలందరూ ఐకమత్యం కావడానికి, స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ నాయకత్వంలో హిందీ భాషను ప్రచారంలోకి తీసుకొచ్చారన్నారు. దేశ సంస్కృతి ,సంప్రదాయాలు నిలబెట్టుకోవాలన్న జాతీయ భాష అత్యవసరమని, విద్యార్థులు మాతృభాషతో పాటు ,జాతీయ భాషను నేర్చుకొని మన సంస్కృతి, మతసామరస్యాన్ని కాపాడాలని ,సోదర భావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో 200 యూనివర్సిటీలలో హిందీ భాష బోధన జరుగుతున్నదని, హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఉపాధి కూడా లభిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం వెంకటరమణ ,శ్రీదేవి ,రాజ్ కుమార్, వజ్ర మ్మ, దుర్గయ్య, రవీందర్ రెడ్డి రాజమోహన్ గౌడ్ ,కనకయ్య, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.